శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (14:31 IST)

కేరళలో భార్యల మార్పిడి కేసు.. 26 ఏళ్ల మహిళ హత్య..

woman
కేరళలో భార్యల మార్పిడి కేసు సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ దారుణంగా హత్యకు గురైంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్తే హత్య చేసి ఆపై తప్పించుకునేందుకు విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం షినో మాథ్యూ కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. భార్యల మార్పిడి ప్రధాన సూత్రధారి అయిన షినోనే తన కుమార్తెను హత్య చేసి ఉంటాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. 
 
కపుల్ మీట్స్ కేరళ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా భార్యల మార్పిడి జరుగుతోంది. ఈ గ్రూపులో ఉన్న 9 మందికి పైగా సభ్యులు తమ భార్యలను మార్చుకున్నారు. 
 
ఈ క్రమంలో షినో కూడా తన భార్యను బలవంతంగా వారి వద్దకు పంపారు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారం జరిగింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆవేశానికి గురైన షినో భార్యను హత్య చేశాడు.