గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దైవదర్శనానికి వచ్చిన కేరళ మహిళ గ్యాంగ్ రేప్.. సీఎంకు భర్త వినతి

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రసిద్ధ పుణ్యస్థలం పళని మురుగన్ ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన కేరళ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అత్యాచార ఘటనపై బాధితురాలి భర్త ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇటీవల కేరళకు చెందిన ఓ జంట పళని ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చింది. ఆ యువ జంటపై కొంతమంది దాడి చేశారు. గదిలో ఉన్న భర్తను కొట్టి యువతీపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. 
 
20 రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఎవరూ సహకరించకపోవడంతో సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. స్పందించిన సీఎం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు.