సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:15 IST)

భర్త పాస్‌పోర్ట్‌లో కిరాణా సామాన్ల లిస్టు రాసిన భార్య

పాస్‌పోర్ట్ అంటే ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్. అది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు. ఫలానా దేశానికి చెందిన వ్యక్తి అనే గుర్తింపును తెలుపుతుంది. అటువంటి పాస్‌పోర్ట్ కొత్తదైనా, పాతదైనా అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కేరళలో ఓ మహిళ మాత్రం తన భర్త పాస్ పోర్టును ఓ టెలిఫోన్ డైరెక్టరీలాగా మార్చేసింది. 
 
పాత కాలంలో ఫోన్ నంబర్లు పుస్తకాల్లో రాసి పెట్టుకునేవారు. ఇప్పుడు అంతా చేతిలో మొబైల్ పట్టుకుని మీ నెంబర్ చెప్పండి అంటూ టకటకా సెల్ ‌ఫోన్‌లో నెంబర్లు ఫీడ్ చేసేస్తున్నారు. ఎక్కడో కొందరు పెద్ద వారు మాత్రం ఇంకా ఫోన్ నెంబర్లను పుస్తకాల్లో రాస్తున్నారు. 
 
ఈ కేరళ మహిళ కూడా ఆ కోవకే చెందినట్టుంది. అందుకే భర్త పాస్‌పోర్టులోని పేజీలను ఫోన్ నెంబర్లతో నింపేసింది. కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే కాదు.. చివర్లో కొన్ని పేజీల్లో కిరాణా సామాన్లు, సరుకులు, ఇతర వస్తువులు, చిట్టాపద్దులు కూడా రాసిపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.