శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (12:48 IST)

కేరళలో ప్రణయ్ హత్య తరహాలోనే... కుమార్తె భర్తను చంపేసి కాలువలో పడేశారు...

కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు తరహాలోనే మర్డర్ జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 
 
కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23) అనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి నీనూ జోసెఫ్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించి అతని శవం చాలియెక్కర కెనాల్‌లో పడేసింది. రిజిస్టర్ మ్యారేజ్ జరిగిన 2 రోజులకే ఈ హత్య జరిగింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. ప్రమాదవశాత్తు కాలువలోపడి మరణించినట్టుగా పేర్కొని కేసు మూసేశారు. కానీ, మృతుని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని పరువు హత్యగా నిర్ధారించిన కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు... ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.