బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (09:22 IST)

గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం భార్య హత్య: ఒరాకిల్‌ ఎగ్జిక్యూటివ్‌ అరెస్ట్‌

ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి.. ఆ తర్వాత మారు వేషం, మారు పేరుతో 15 యేళ్ల పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. పైగా, ఈ నిందితుడు ఒరాకిల్ టెక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అహ్మదాబాద్‌‌కు చెందిన తరుణ్‌ అనే వ్యక్తిగిత గత 2002 నవంబరు 15వ తేదీన బ్యాంకు ఉద్యోగిని సాజ్నితో పెళ్లి జరిగింది. కానీ  పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు. ఆ తర్వాత పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ బెంగుళూరులోని ఒరాకిల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, సంవత్సరానికి రూ.22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతూ వచ్చాడు.
 
అయితే, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, ఈ హత్య కేసులో ఏదో మర్మమున్నట్టు గుర్తించారు. దీంతో తరుణ్ కోసం గాలించసాగారు. తరుణ్‌ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే  బాబు పోలీసులకు చిక్కాడు. 
 
అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్‌ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ,  సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్‌ కుమార్‌ జినారాజ్‌, అలియాస్‌ ప్రవీణ్‌ (42)  చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు.