శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (12:38 IST)

పెద్దపులిని షూట్ చేశారు.. టపాకాయలు.. కాల్చి, స్వీట్లు పంచుకున్నారు..

పెద్దపులి బారి నుంచి 22 గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించారు. హైదరాబాద్ షార్ప్ షూటర్స్ షఫత్ అలీ, అజ్గర్ అలీలు మహారాష్ట్రలోని 22 గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించారు. అవని అనే పులి.. గత రెండేళ్లలో 13మంది మనుషులను చంపి తిన్నది. ఈ ఏడాది ప్రథమార్థంలో సుప్రీంకోర్టు పులిని చంపేందుకు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీచేసింది.
 
జంతు హక్కుల కార్యకర్తలు పులిని చంపడం కాకుండా ప్రాణాలతో పట్టుకోవాల్సిందిగా విన్నవించినప్పటికీ సుప్రీం నిరాకరిస్తూ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసింది. గత నెలన్నర నుంచి వేట ప్రారంభించిన హైదరబాద్ షార్ప్ షూటర్స్ అవనిని అంతమొందించారు.
 
నవంబర్ 2వ రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్‌లో అజ్గర్ అలీ అవనిని కాల్చి చంపేశారు. పులి నుంచి గ్రామస్థులను రక్షించేందుకు టి1 ఆపరేషన్ చేపట్టామని మా ఆత్మరక్షణ కోసం అవనిని షూట్ చేయక తప్పలేదని అజ్గర్ అలీ చెప్పారు. ఈ ఆపరేషన్‌పై వస్తున్న విమర్శలను అజ్గర్‌ తండ్రి షఫత్ అలీ తిప్పికొట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పులిని చంపాల్సి వచ్చిందని తెలిపారు. 
 
ఇకపోతే.. పులి అవని మృతితో యావత్మాల్‌లోని స్థానికులు వేడుక చేసుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. మరోవైపు అవని కళేబరానికి నాగ్‌పూర్‌లోని గోరేవాడ రెస్క్యూ సెంటరులో పోస్టుమార్టం నిర్వహించారు.