గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:56 IST)

ఎన్నికల కోసం పెట్రోల్ ధరలు పెంచారా..? కేంద్రంపై నెటిజన్ల ఫైర్

సామాన్య జనాలకు కొంత ఊరటను కలిగించేందుకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2.50 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలపై కేంద్రం తగ్గిన ధరలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

సామాన్య జనాలకు కొంత ఊరటను కలిగించేందుకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2.50 మేర  కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలపై కేంద్రం తగ్గిన ధరలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురుస్తోంది. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని తిప్పడానికే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ తప్పుపట్టింది. 
 
అలాగే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రానుండటంతోనే పెట్రోల్ ధరలు తగ్గాయని.. లీటరుపై రూ.2.50 మేర తగ్గించారని నెటిజన్లు మండిపడుతున్నారు.  అనేక దేశాల్లో పెట్రోలును రూ.35కే అమ్ముతుంటే, భారత్‌లో మాత్రం రూ. 90 విక్రయిస్తున్నారని నెటిజన్లు గరం అవుతున్నారు. 
 
ఇప్పుడు కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని కేంద్రాన్ని అడుగుతున్నారు. ధరలు పెరుగుతూ ఉంటే మిన్నకుండిపోయిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా ధరలు తగ్గించి పండగ చేసుకోమన్నట్టు వ్యవహరించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.