గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:16 IST)

ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి?

కుట్రాలంలో ఓ ప్రేమ వ్యవహారం వివాదంగా మారడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు, తిరుప్పూర్ జిల్లా, పుళియంపట్టికి చెందిన కార్తీక్ రాజా (18) పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదువుతూ వచ్చాడు. కార్తీక్‌కు అదే కాలేజీకి చెందిన విద్యార్థినితో ప్రేమ ఏర్పడింది. కార్తీక్ రాజా అదే కాలేజీకి చెందిన యువతితో ఏడాది పాటు ప్రేమాయణం నడిపాడు. 
 
అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా వుండి ప్రేమను గెలిపించుకోవాలనుకున్న కార్తీక్.. తన ప్రేయసిని తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చాడు. 
 
ఆపై ఆ ప్రేమ జంట కుట్రాలంలోని ఓ లాడ్జిలో బస చేసింది. అయితే ఇంతలో కార్తీక్ రాజాకు ఏమైందో ఏమో కానీ లాడ్జిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రాజా ప్రేయసి వద్ద విచారణ జరుపుతున్నారు.