శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (17:57 IST)

మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య.. కారణం ఏంటి?

మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇంటి కోడలు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.  విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు సవిత పర్మార్(23) ఆత్మహత్యకు పాల్పడింది. 
 
షాజాపుర్​ జిల్లా పొంచానేర్​ గ్రామంలోని తన నివాసంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం సవిత పర్మార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతదేహానికి సమీపంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
వివరాల్లోకి వెళితే.. సవిత పర్మార్ (22) మూడు సంవత్సరాల క్రితం ఇందర్ సింగ్ పర్మార్ కుమారుడు దేవరాజ్ సింగ్‌‌ను వివాహం చేసుకున్నారు. 
 
మంగళవారం సవిత ఆత్మహత్య సమయంలో, ఇందర్ సింగ్ పర్మార్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉండగా, సవిత భర్త దేవరాజ్ సింగ్ ప్రక్కనే ఉన్న గ్రామమైన మొహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఇంట్లో ఇతర బంధువులు ఉన్నారు.