శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (19:32 IST)

ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. నెల తిరక్కుండానే మరణశిక్ష

ఒక ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడికి నెల తిరక్కుండానే మరణశిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో బుధవారం వెలుగు చూసింది.

సరిగ్గా 26 రోజుల క్రితం తన ఇంటికి దగ్గరలోని పొలంలో ఆడుకుంటుందా పాప. ఆమెను చూసిన ఒక 21 ఏళ్ల యువకుడు ఆ పాపను కిడ్నాప్ చేశాడు. ఆపై ఆమెపై బలాత్కారం చేశాడు. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగింది. 
 
ఆ తర్వాత అటుగా వచ్చిన కొందరు స్థానికులు తీవ్రంగా గాయపడి ఒక నిర్జన ప్రదేశంలో పడి ఉన్న ఆ పాపను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుపై విచారణ చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది.