ఏమైందో ఏమో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు...
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత ప్రస్తుత కాలంలో కనుమరుగు అవుతోంది. కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో బిపిన్, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ కూలీపనులకు వెళ్తుంటాడు.
కొద్దీ రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో.. భార్యను గొడ్డలితో నరికేసి.. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడివున్నారు.
దీంతో అతడు పోలీసులకు, లలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.