శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (15:09 IST)

బహిరంగంగా ముద్దాడుతుంటే అభ్యంతరం చెప్పాడనీ హతమార్చారు.. ఎక్కడ?

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం మాఫియా నేరాలే కాదు.. సాధారణ యువకులు యధేచ్చగా నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. ఓ యువకుడు తన ప్రియురాలికి బహిరంగంగా ముద్దుపెడుతుంటే ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆ వ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం మాఫియా నేరాలే కాదు.. సాధారణ యువకులు యధేచ్చగా నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. ఓ యువకుడు తన ప్రియురాలికి బహిరంగంగా ముద్దుపెడుతుంటే ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని ఆ యువకుడితో పాటు స్నేహితులు కలిసి పొడిచి చంపేశారు. సెంట్రల్ ముంబై పరిధిలోని పరేల్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్రలోని సెంట్రల్ ముంబై నగర పరిధిలోని పరేల్ ప్రాంతంలో మోంటీ అనే యువకుడు ఓ అమ్మాయిని రోడ్డు పక్కనే బహిరంగంగా ముద్దాడుతున్నాడు. మోంటీ రోడ్డు పక్కనే బహిరంగంగా ముద్దాడుతుండటం చూసిన గణేష్ సాహానా అనే వ్యక్తి దీనిపై అభ్యంతరం చెప్పాడు. అంతే ఆగ్రహించిన మోంటీ తన ఐదుగురు స్నేహితులను పిలిచి గణేష్ సాహానాపై దాడికి దిగాడు. 
 
రోడ్డుపై పడివున్న గాజు ముక్కలను తీసుకుని గణేష్‌ను పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపై పోలీసులు రంగప్రవేశం చేసి ప్రధాన నిందితుడైన మోంటీని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.