రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. సీరియల్ చూస్తానని యువతిపై అత్యాచారం..

Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:39 IST)
రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా యువతిని లైంగికంగా వేధించాడు. యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి, వానరపేటకు చెందిన విన్సెంట్ (39) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం వుంది. 
 
ఈ నేపథ్యంలో పెయింటింగ్ కోసం ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ యువతిని చూశాడు. ఆమెపై కన్నేశాడు. ఓసారి ఎవ్వరూ లేని సమయంలో ఆ ఇంటికి వెళ్లాడు. ఆ యువతితో సీరియల్ చూసి వెళ్తానని టీవీ ఆన్ చేయమన్నాడు.
 
ఇంతకుముందు ఇంటికొచ్చిన వ్యక్తి అని టీవీ ఆన్ చేసి ఆ యువతి తన పని తాను చేసుకుంది. అలా సదరు యువతి గదికి వెళ్లిన విన్సెంట్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విన్సెంట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :