గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (08:41 IST)

నీ భర్తను గురి చూసి కాల్చి చంపేయ్, ఇక మనం ఎంజాయ్ చేద్దామన్న యువకుడు, కానీ..

అతనికి 18 సంవత్సరాలు. ఆమెకు 45 సంవత్సరాలు. ఇద్దరూ శారీరకంగా కలిశారు. ఆ వివాహిత కొడుకు వయస్సున్న వ్యక్తితో కమిట్ అయ్యింది. ప్రియుడే సర్వస్వమని భావించి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. భర్తను ఎలా చంపాలో ప్రియుడే స్వయంగా ట్రైనింగ్ ఇచ్చాడు. చివరకు..
 
దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ ప్రాంతానికి చెందిన 45 యేళ్ళ బబిత, 48 యేళ్ళ భీమ్ రాజ్‌కు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఒక కుమార్తె ఉంది. కుమార్తెకు పెళ్ళి చేసి పంపించేశారు. భీమ్ రాజ్ ఓ కంపెనీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ డ్రైవింగ్ వృత్తిలో ఉండటంతో 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. దీంతోపాటు కుమార్తెకు కూడా పెళ్ళి చేసేయడంతో బబిత ఒంటరిగా ఇంట్లో ఉండేది.
 
దీంతో తన ఇంటికి దగ్గరలో ఉన్న ప్రొవిజన్ షాపు ఓనర్ రోషన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తన ఇంట్లోనే ప్రియుడితో బబిత ఎంజాయ్ చేసేది. అయితే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. 
 
ప్రియుడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన బబిత భర్తను వదిలించుకోవాలనుకుంది. ప్రియుడు రోషన్ పక్కా ప్లాన్ వేయడంతో ఆ ప్లాన్‌ను ఫాలో అయ్యింది. ఒక తుపాకిని తీసుకొచ్చి నిద్రించేటప్పుడు కాల్చేయమని చెప్పాడు రోషన్. ప్రియుడు చెప్పినట్లే నిద్రిస్తున్న భర్తను కాల్చి ఆ తరువాత పారిపోయింది.
 
రెండురోజుల క్రితం ఘటన జరిగితే పోలీసులు పరారీలో ఉన్న భార్యపై అనుమానంతో కేసు నమోదు చేశారు. ఆ తరువాత ప్రియుడితో ఉన్న అఫైర్ తెలియడంతో నిందితురాలు భార్యేనని నిర్ధారించుకున్నారు. పరారీలో ఉన్న బబితను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.