గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (17:13 IST)

రాజకీయ సన్యాసం తీసుకుంటా, బీజేపీతో పొత్తు పెట్టుకోను: మాయావతి

దేశ రాజకీయాల్లో ఆమెది ప్రత్యేక శైలి. ఇంత ఇమేజ్ ఉన్న బిఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆమె వ్యవహార, కార్యకలాపాలు విభిన్నంగా ఉంటాయి.
 
బీజేపీ పార్టీ ఎప్పుడూ కుల, మత సిద్దాంతాలపై, పెట్టుబడిదారీ విధానంపై దృష్టి సారిస్తుందని ఆమె మండిపడ్డారు. తమది ఎప్పుడూ సర్వజన హితమైన పార్టీ అని కొనియాడారు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోనని చెప్పారు.
 
మతతత్వ పార్టీలపై తన పోరాటం కాలానుగుణంగా కొనసాగుతూ ఉంటుందని అన్నారు. తాను ఎవరి ముందు తలవంచే  ప్రసక్తి లేదని చెప్పారు.