మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (18:11 IST)

ప్రియురాలి కోసం భార్యను చంపేయమన్న పోలీస్... పిల్లల్ని చూసి హంతకుడు కన్నీళ్లు

ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకున్న ఆ పోలీస్. ఐతే డైరెక్టుగా అతడే చంపేస్తే హత్యా నేరం అతడిపైకి వస్తుంది కనుక హంతకులను కాంటాక్ట్ చేశాడు.

ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకున్న ఆ పోలీస్. ఐతే డైరెక్టుగా అతడే చంపేస్తే హత్యా నేరం అతడిపైకి వస్తుంది కనుక హంతకులను కాంటాక్ట్ చేశాడు. ఇందులో భాగంగా అతడికి రూ. 4 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. డబ్బు తీసుకున్న హంతకుడు తన ముఠాతో ఆ పోలీసు భార్యను చంపేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఐతే అక్కడ దృశ్యాన్ని చూసి హంతకుడు కన్నీని పర్యంతమయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని శివమొగ్గలో రవీంద్ర హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అనిత అనే భార్యతో పాటు ఇద్దరు పిల్లలు వున్నారు. వారిలో పెద్దపిల్లవాడికి 8 ఏళ్లు, అమ్మాయికి ఆరేళ్లు. ఐతే ఈ హెడ్ కానిస్టేబలు గత కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ప్రియురాలిని పర్మినెంటుగా తన భార్యగా చేసుకోవాలంటే కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకున్నాడు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ ఫిరోజ్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. 
 
తన భార్యను అంతం చేస్తే రూ. 4 లక్షలు ఇస్తానని చెప్పడంతో అతడు తన గ్యాంగ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాడు. అర్థరాత్రి మాటువేసి చంపాలనుకున్న అతడికి అక్కడ తల్లీపిల్లల్ని చూసి షాకయ్యాడు. అమ్మ ఒడిలో వారు నిద్రిస్తుండగా ఆమె పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈ దృశ్యాన్ని చూసిన హంతకుడి గుండె కరిగిపోయింది. అతడి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆమెను హతమారిస్తే పిల్లలు అనాధలైపోతారని పోలీసుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవలే అతడు మరో కేసులో పట్టుబడగా బయటపడింది. అతడి వద్ద వున్న అనిత ఫోటోను చూసి పోలీసులు కూపీ లాగగా విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది.