బస్సులో చార్జింగ్ పోర్ట్ లేదనీ.. 5 వేల ఫైన్........
యాడ్స్‌లో చూపిన విధంగా బస్సులో ఎయిర్‌కండిషనింగ్, మొబైల్ చార్జింగ్ పాయింట్లేకపోవడంతో పాసింజర్‌కు రూ.5 వేల ఫైన్ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఓ కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. సతీష్ రతన్ లాల్ దయామా తన ఫ్రెండ్‌తో కలిసి శివ్షాహి బస్‌లో జల్నా నుంచి ఔరంగాబాద్‌కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్ పాయింట్ కోసం అడిగాడు. అయితే బస్సులో ఏసీ, చార్జింగ్ పాయింట్ పని చేయడం లేదని చెప్పారు.
కంప్లయింట్ రిజిస్టర్‌ను ఇవ్వాలని బస్ డ్రైవర్, కండక్టర్‌ను అడిగితే ఇవ్వలేదు. దీంతో అతడు జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫోరంలో కంప్లయింట్ చేశాడు. ఏసీ, చార్జింగ్ పాయింట్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్ టెన్షన్ అనుభవించానని అందులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్‌లో ఏసీ, మొబైల్ చార్జింగ్ పోర్ట్ గురించి ప్రచారం చేశాయని, టికెట్లను కూడా అందుకు తగ్గట్టే చార్జ్ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవని తెలిపాడు. వాదనలు విన్న జల్నా జిల్లా కన్స్యూమర్ కోర్టు.. 30 రోజుల్లో సతీష్‌కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.