గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:26 IST)

12న దేశవ్యాప్త నిరసనలు .. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్తంగా అన్ని గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని రాష్ట్ర ప్రజలకు భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది.

విజయవాడ బందర్‌రోడ్డు రాఘవయ్య పార్కువద్ద కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఎఐఎడబ్ల్యుయు (ఆలిండియా అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌) జాతీయ కమిటీ నాయకులు నిరసన తెలిపారు.

వ్యవసాయ కార్మికుల పట్ల మోడీ సర్కార్‌ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కోట్లాది కార్మికులకు ఉపాధిని కల్పించే ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో కోత విధించడాన్ని తీవ్రంగా ఖండించారు.
 
ఎఐఎడబ్ల్యుయు జాతీయ ఉపాధ్యక్షులు బిజులాల్‌ భారతి మాట్లాడుతూ... తక్షణమే బడ్జెట్‌ను సవరించి రూ.1.20 లక్షల కోట్లు ఉపాధి హామీ పథకానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

లేకుంటే కేంద్ర బడ్జెట్‌ను కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోరని తెలిపారు. ఎఐఎడబ్ల్యుయు ఆలిండియా ఉపాధ్యక్షులు కోమల కుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు ఉపాధి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.