శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (09:50 IST)

ఒడిశా రాష్ట్రంలో దారుణం.. బాలికను చంపి.. శవంతో..?

దేశంలో మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. నాయగర్‌‌లో ఐదేళ్ల బాలికను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల మైనర్ బాలికపై నిందితుడు మొదట ఎలా దాడి చేశాడో, ఆమెను చంపి, శవంతో లైంగిక సంబంధం పెట్టుకునే ప్రయత్నం ఎలా చేసాడో… ఈ దారుణాన్ని సిట్ చీఫ్ అరుణ్ బోత్రా మీడియాకు వెల్లడించారు. 
 
మీడియాతో మాట్లాడిన సిట్ చీఫ్ అరుణ్ బోత్రా… నాయగర్ మైనర్ బాలిక హత్య కేసులో అరెస్టయిన యువకుడు సరోజ్ సేథి అని పేర్కొన్నారు. సరోజ్ సేథి చైల్డ్ అశ్లీల చిత్రాలకు బానిసయ్యాడని, తన సోదరి ఫోన్‌‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను తరచూ చూసేవాడని బోత్రా వెల్లడించాడు. 
 
నేరం జరిగిన రోజు ముందు రాత్రి అంతా నిందితుడు తన మొబైల్‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను చూశాడు అని సిట్ చీఫ్ చెప్పారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాలను వివరిస్తూ… నిందితుడు సేథి ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడని తెలిపారు.ే