శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (12:00 IST)

మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బెదిరించి ఆ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. 
 
అంతేగాకుండా తన వద్ద గన్ వుందని.. ఆమె తల్లిదండ్రులను కాల్చేస్తానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. విషయం బయట పడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన గోపిగా గుర్తించారు.