శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (14:39 IST)

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున క

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున కంబర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే కంబరామాయణంలోనే కంబర్ అనే పేరు దాగివుంది. 
 
అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం కంబరామాయణాన్ని రాసింది షేక్కియర్ అంటూ గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. దీంతో ఈపీఎస్‌కు కంబరామాయణాన్ని రాసింది కూడా ఎవరని తెలియదా అంటూ తమిళ సాహితీవేత్తలు ఫైర్ అవుతున్నారు. 
 
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను వేదికపై చదివిన ఈపీఎస్‌పై వారు మండిపడుతున్నారు. మరోవైపు కంబరామాయణం కర్త పేరు కూడా తెలియని సీఎంపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. నెటిజన్లు ఈపీఎస్‌లో మీమ్స్ పేలుస్తున్నారు.