శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (09:41 IST)

ఇవాంకా వచ్చిందని హడావుడి ఎందుకు..? ఏంటో ఈ ఖర్మ?: మాధవీలత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ రంగు రంగులతో ముస్తాబైన సంగతి తెలిసిందే. దీనిపై సెటైర్లు, విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నచ్చావులే హీరోయిన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ రంగు రంగులతో ముస్తాబైన సంగతి తెలిసిందే. దీనిపై సెటైర్లు, విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నచ్చావులే హీరోయిన్ మాధవీలత కూడా హైదరాబాదు ఇవాంక రాకతో కొత్త హంగులు సంతరించుకోవడాన్ని తప్పుబట్టింది. సోషల్ మీడియా వేదికగా హైదరాబాదులో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. 
 
ముందుగా ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి, హంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అతిథుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టం చేసింది. ట్రాఫిక్ సమస్యలకు తోడు పోలీసుల ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నామని ఫైర్ అయ్యింది. అడిగితే సెక్యూరిటీ కారణాలని పోలీసులు చెప్పడం చిరాకుగా వుంటుందని తెలిపింది. 
 
మన దేశంలో వీఐపీల ప్రాణాలకు తప్ప మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదా? అంటూ అడిగింది.  ఆమె ప్రశ్నించింది. వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్టులు తెస్తారో? తెలియదు కానీ సాధారణ ప్రజానకానికి మాత్రం ఇబ్బందులు ఖాయమని మాధవీలత వ్యాఖ్యానించింది. అమెరికాకు మన అధినేతలు వెళ్తే వాళ్లేమీ కొత్తగా చేయరెందుకు? వారికి ఆ హడావుడి చేయాల్సిన అవసరం వారికి లేదా? వారికి ఆ హడావుడి అవసరం లేదా? ఎందుకంటే వారికి రోడ్లన్నీ కచ్చితంగా వున్నాయనేగా అర్థం.. దీనినిబట్టి మనం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం వుందనేగా.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి అతిథి కోసం కాకుండా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని కోరింది. అలా చేస్తే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి, హంగులు అవసరం లేదన్నారు. అయినా మనకు సిగ్గురాదని.. అలాంటి నాయకులకే ఓట్లు వేస్తాం. ఎవరో వచ్చారని రోడ్లేశారు.. అనే ఆనందంతో పొంగిపోతామని.. ఏంటో ఖర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అయినా మనకు సిగ్గురాదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే నాయకులకు ఓట్లు వేస్తాం, ఎందుకంటే, ఎవరో ఒకరు వస్తున్నారనైనా రోడ్లు వేశారు కదా అన్న ఆనందంతో పొంగిపోతామని తెలిపింది. ఏంటో ఈ ఖర్మ? అంటూ నిట్టూర్చింది. తన పోస్టు ఎవరికి నచ్చినా నచ్చుకున్నా... ప్రభుత్వ విధానాలు నచ్చలేదని మాధవీలత సూటిగా చెప్పింది. తన పోస్టు నచ్చినా నచ్చకపోయినా దాని గురించి ఆందోళన వ్యక్తం చేయనని వెల్లడించింది.