బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (14:54 IST)

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. 2 భోగీలు దగ్ధం ( Video)

ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స

ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలో బయల్దేరిన ఈ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ గ్వాలియర్ వద్దకు చేరుకుంటుండగా అగ్నిప్రమాదం ఏర్పడింది. 
 
ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. బీ5 ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేశారు. ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. 
 
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఏసీ బోగీల్లో కిటికీలు మూసే వుంచడం ద్వారా భోగీలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. చూడండి వీడియోను...