సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ లక్ష్మీ నగర్ చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అనే ప్రత్యేకమైన రవాణా విధానాన్ని ఎంచుకున్నారు. మెట్రోలో సాధారణ మహిళలా ప్రయాణించింది. సాధారణ ప్రజలకు దగ్గరవ్వాలనే రీతిలో ఢిల్లీ మెట్రోలో ఆమె ప్రయాణించారు. తన ప్రయాణంలో, ఆమె తోటి ప్రయాణికులతో సంభాషిస్తూ, వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే కేంద్ర మంత్రిగా వుండి సాధారణ మహిళల మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు నిర్మలా సీతారామన్‌పై ప్రశంసిస్తున్నారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మాలివాల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి బిభవ్ కుమార్‌తోనే సిగ్గులేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్నట్లు మంత్రి ఆరోపించారు.