శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:44 IST)

రోటరీ క్లబ్ నుంచి నీతా అంబానీకి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు

Nita Ambani
Nita Ambani
రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు 2023-24 అందుకున్నారు. "ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిలో పరివర్తనాత్మక సంస్థలను సృష్టించడం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి నీతా అంబానీకి ఈ అవార్డు లభించింది" అని రిలయన్స్ ఫౌండేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సన్మానం అందుకున్నందుకు నీతా అంబానీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, "మన నగరానికి, సమాజానికి రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే అపారమైన కృషి చేస్తోంది. అలాంటి సంస్థ నుంచి నేను ఈ అవార్డును అందుకోవడం పట్ల గౌరవంగా ఫీలవుతున్నాను. 
 
1969లో మా మామగారు శ్రీ ధీరూభాయ్ అంబానీ గౌరవ రోటేరియన్‌గా మారినప్పటి నుండి, 2003లో ముఖేష్ కూడా రోటరీతో నా కుటుంబానికి దశాబ్దాల అనుబంధం వుంది. రోటరీగా ఇది నా 25వ సంవత్సరం. నేను ఈ ప్రయాణాన్ని ఎంతో ఆదరిస్తున్నాను." అని నీతా అంబానీ పేర్కొన్నారు.