మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (16:11 IST)

ప్రేమికుల రోజుకు, శివరాత్రికి లింక్ పెట్టిన నిత్యానంద స్వామి

ప్రేమికుల రోజును పురస్కరించుకుని వివాదాస్పద స్వామిజీ ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమికుల రోజు నిత్యానంద ప్రేమికులకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమికుల రోజు సందర్బంగా నిత్యానంద స్వామి శుభాకాంక్షలు చెప్తున్న వీడియోలో నిత్యానంద ప్రేమికుల రోజుకు అతి దగ్గరలో శివరాత్రి పండుగ ఉందని, ఈ రెండు పండుగలు మీరు సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
అబ్బాయిలు (భాయ్స్) రోజా పూలు తీసుకుని వీలైనన్ని చోట్ల విసరాలని, అదే ప్రేమికుల రోజు ప్రత్యేకత అంటూ నిత్యానంద పకపకా నవ్వారు. అయితే ప్రేమికుల రోజుకు, శివరాత్రికి లింక్ ఏమిటిలో అర్థం కాక ప్రజలు, నిత్యానంద భక్తులు అయోమయానికి గురైనారు. మైనర్ అమ్మాయిలను నిర్బంధించారని, వారిని ఆశ్రమం నుంచి బయటకు రానివ్వడం లేదని ఆరోపణలు రావడం, గుజరాత్ పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో నిత్యానంద మాయం అయ్యారు. 
 
నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి నిత్యానంద భారత్ విడిచి విదేశాలకు పారిపోయారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం నిత్యానంద ఈక్విడార్ లో ఓ ద్వీపం కొనుగోలు చేసి అక్కడ కైలాస దేశం ఏర్పాటు చేసుకుని అక్కడే శిష్యులతో కలిసి నివాసం ఉంటున్నారని ఇటీవల విడుదలైన వీడియోలో వెలుగు చూసింది.