బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (10:57 IST)

#PromiseDay మీ వాగ్ధానం ఎలా వుండాలంటే?

వాలెంటైన్స్ వారంలో భాగంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి11న ప్రామిస్-డేగా జరుపుకుంటారు. ఈరోజున ప్రేమికులు, ఒకరికొకరు వారి ప్రేమపట్ల నిబద్ధతను తెలియజేసేలా ప్రామిస్ చేస్తుంటారు.

ప్రేమ భాగస్వాముల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వాలెంటైన్ వీక్‌లోని ప్రామిస్ డే ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ప్రేమపట్ల ఎంత విధేయతను, ఎంత నిజాయితీని కలిగి ఉన్నారో అర్ధమయ్యేలా మీ భాగస్వామికి తెలియజేసేందుకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు.
 
మీ భాగస్వామి సంతోషాలలోనే కాకుండా, కష్టాలలో కూడా తోడుంటారనే నమ్మకాన్ని ఇవ్వండి. ఎటువంటి దాపరికాలు లేకుండా ఒక నమ్మకమైన సంబంధాన్ని కలిగి ఉన్నామన్న భరోసా మీ ప్రామిస్‌లో వుండేలా చూసుకోవాలి. 
 
వీలైనంత సమయం వారితో వెచ్చిస్తామని, క్లిష్ట సమయాల్లో కూడా ఒంటరిగా వదిలి వెళ్ళనని వాగ్ధానం చేయాలి. అసత్యాలు చెప్పనని, వ్యసనాలకు దూరంగా వుంటానని.. కుటుంబ విషయంలో, చర్చల్లో భాగస్వాముల ఆలోచనలకు గౌరవం ఇస్తామని వాగ్ధానం చేస్తే.. మీ ప్రేమ భాగస్వామికి మీరంటే అమితమైన అభిమానం ఏర్పడుతుంది. కానీ ఈ వాగ్ధానంలో నిజాయితీ వుండాలనే విషయాన్ని మాత్రం మరిచిపోకండి. మీరు వాగ్ధానం చేసేముందు చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం మరిచిపోకండి సుమా..!