శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (14:14 IST)

#HugDay హత్తుకుంటే హాయి హాయి.. కౌగిలింతతో ప్రేమను..?!

ప్రేమికుల రోజును పురస్కరించుకుని వాలెంటైన్ వీక్‌ను జరుపుకుంటున్నారు ప్రేమికులు. ఈ క్రమంలో ఫిబ్రవరి 12వ తేదీని హగ్ డేగా జరుపుకుంటున్నారు. కౌగిలింత వల్ల ప్రేమికులు ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటారు. హగ్ అనేది ప్రేమ భాగస్వామ్యులు కంఫర్ట్‌గా ఫీలవడానికి ఉపకరిస్తుంది.  కౌగిలింత వల్ల ఒత్తిడి తగ్గి భరోసా లభిస్తుంది. హగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
 
ఆత్మవిశ్వాస లేమితో సతమతం అవుతున్న వారిలో స్పర్శ వల్ల వ్యాకులత తగ్గుతుందని మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. కౌగిలింత గుండె ఆరోగ్యానికి మంచిది. చేతిలో చేతిని వేసి ఉంచడం, కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందనల రేటు తగ్గుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. 
 
హగ్గింగ్ వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందం పెరుగుతుంది. కౌగిలింత హార్మోన్ అని కూడా పిలిచే ఆక్సిటోసిన్ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇంకేముంది.. మీ భాగస్వామికి ఓ గిఫ్ట్ ఇచ్చి... హ్యాపీగా ఓ హగ్ చేసుకోండి.. హ్యాపీ హగ్ డే.