ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (14:07 IST)

గంగాజలంతో కరోనా వైరస్‌ను తరిమికొట్టవచ్చా?

పవిత్ర గంగానది జలం కరోనాకు దివ్యౌషధంగా పనిచేస్తుందని తేలింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా గంగానదిలో కాలుష్యం చాలా తగ్గింది. ఇప్పుడు గంగానదిలో చాలా ప్రదేశాల్లో నీటిని తాగొచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ తెలిపింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కట్టడికి గంగానది నీటితో పరిష్కారం దొరుతుందనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఐసీఎమ్మార్ తాజా ప్రతిపాదన సారాంశం కరోనాతో జడుసుకున్న జనానికి ఓ మంచి ప్రతిపాదనను ఇచ్చింది. 
 
గంగానది నీటితో కరోనా వైరస్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని ఐసీఎమ్మార్ పేర్కొంది. గంగానదికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల కరోనా వైరస్‌ను చంపేయగలదని ఆ ప్రతిపాదన సారాంశం. జలశక్తి మంత్రిత్వ శాఖలోని గంగా శుద్ధి జాతీయ మిషన్ ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్మీలో రిటైర్ అయిన వారు ఏర్పాటు చేసుకున్న అత్యుల్య గంగ అనే సంస్థ ఈ రిక్వెస్ట్ చేయడంతో… ఎన్‌ఎమ్‌సీజీ కూడా ఇదే ప్రతిపాదనను తెచ్చింది. ఇందుకు బలమైన కారణం వుందట. 
 
నింజా వైరస్ అనేది… గంగా నది నీటి పైన జీవిస్తోంది. నిజానికి ఇది వైరస్ కాదు… ఒకరకమైన బ్యాక్టీరియా. కరోనా లాంటి వాటిని తరిమికొట్టేలా వీటిలో శక్తిమంతమైన స్ట్రెయిన్ ఉంది. ఈ బ్యాక్టీరియా మనుషుల శరీరంలో సూక్ష్మక్రిముల నిరోధక వ్యవస్థలా పనిచేయగలదని అతుల్య గంగా వ్యవస్థాపకుడు మేజర్ మనోజ్ కేశ్వర్ (రిటైర్డ్) చెబుతున్నారు. దేశ ప్రజలకు గంగానది పవిత్రమైనదన్న ఆయన… లక్కీగా నింజా వైరస్… కరోనా వైరస్‌ని చంపుతుందేమో పరిశీలిస్తే మంచిదే అని సూచించారు.