శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:03 IST)

మే రెండో వారంలో లక్ష మందికి కరోనా బాధితులు.. వైద్యుల దీనస్థితి

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో దేశమంతా లాక్ డౌన్ అమలవుతుంటే.. వ్యాధి సోకిన వారికి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ, వైరస్ నుంచి రక్షణ పరంగా వారికి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా లేవని తెలుస్తోంది.
 
ప్రొటెక్టివ్ పరికరాలు కరువైయ్యాయి. కొంతమంది వైద్యులు రెయిన్ కోట్లు, మోటార్ బైక్ హెల్మెట్లు ధరించి.. రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వుండటం వైద్యులను కలవరపెడుతోంది.  
 
ఇందులో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్‌ను యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున తయారు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వీటిని సౌత్ కొరియా, చైనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వెల్లడించినా.. అదింకా కార్యరూపం దాల్చలేదు. 
 
ఇప్పటివరకూ దేశంలో 1,500మందికి పైగా కరోనా సోకింది. వారికి చికిత్సను అందిస్తున్న ఫ్రంట్ లైన్ డాక్టర్లకు కూడా సరైన రక్షణ కవచాలు, మాస్క్‌లు లేకపోవడం దురదృష్టకరం. ఓ అంచనా ప్రకారం, మే రెండో వారం ముగిసేసరికి భారత్‌లో లక్ష మంది వరకూ కరోనా బాధితులు ఉంటారని అంచనా. ఇంతమంది రోగులకు చికిత్స చేసే సదుపాయాలు భారత్‌లో లేవు. ఇదే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం.
 
ఇక కోల్‌కతాలోని బెలే ఘటా ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు వేసుకున్న రెయిన్ కోట్లు కూడా చిరిగిపోయి ఉండటం.. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసినవారంతా.. డాక్టర్లకు తగిన ప్రొటెక్టివ్ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్కున్నారు.