ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:55 IST)

చంద్రయాన్-3పై ఇస్రో శుక్రవారం కీలక ప్రకటన

Chandrayaan 3
చంద్రయాన్-3పై ఇస్రో శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల ఇంజిన్లను పునరుద్ధరించే ప్రక్రియ శనివారం చేపట్టనున్నట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ప్రకటించారు. 
 
స్లీప్ మోడ్‌లో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో సిగ్నల్స్ అందట్లేదని ఇస్రో ప్రకటించింది. అయితే వాటిని స్లీప్ మోడ్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.
 
చంద్రుడిపై దిగిన తర్వాత 14 రోజుల పాటు పరిశోధనలు జరిపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు.. జాబిల్లిపై చీకటి పడటానికి ముందే స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.  
 
ఈ నేపథ్యంలోనే ల్యాండర్, రోవర్‌లకు అమర్చిన సోలార్ ప్యానెల్స్‌పై సూర్యకాంతి పడి అవి మళ్లీ ఛార్జ్ అయి.. పని చేసేందుకు సిద్ధమయ్యాయి. 
 
అయితే గడిచిన 14 రోజుల పాటు చంద్రుడిపై రాత్రి కావడంతో ఊష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉండటంతో అసలు ల్యాండర్, రోవర్లు పనిచేస్తాయా అనే అనుమానం కలుగుతోంది.