ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (11:49 IST)

కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ - ప్రారంభించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ

wine
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. మద్యాన్ని ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో ఇంటికి సరఫరా చేయనున్నారు. ఈ సేవలను హైదారాబాద్ నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. ఈ సంస్థ పేరు "బూజీ". ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మద్యాన్ని ఇంటి ముంగిటకు తెచ్చిచ్చే సంస్థ తమదేనని బూజీ నిర్వాహకులు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బూజీ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలను ప్రారంభించింది. ఇపుడు ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెస్ట్ బెంగాల్  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకుని ఈ సేవలను ప్రారంభించింది.