సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (09:06 IST)

సంగీత విభావరిలో విషాదం : గుండెపోటుతో గాయకుడు మృతి

murali prasad mahapatra
సంగీత విభావరిలో ఓ విషాద ఘటన జరిగింది. గాయకుడు గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం పట్టణంలోని జగన్ జనని ఆలయ ఆవరణలో జరిగింది. 
 
దసరా శవన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఆలయంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జయపురానికి చెందిన గాయకుడు మురళీ ప్రసాద్‌ మహాపాత్ర (54) ఓ గాయకుడుగా పాలుపంచుకున్నాడు. 
 
ఈయన రెండు పాటలు పాడిన ఆయన అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన శ్రోతలు, కళాకారులు జిల్లా ప్రధానాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంతవరకు సరదాగా ఉన్న వాతావరణం ఆయన మృతితో విషాదంగా మారిపోయింది.