శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (13:46 IST)

రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సెహ్వాగ్ విద్యాదానం

virender sehwag
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. సెహ్వాగ్ చేసిన ఈ ప్రకటనను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 
 
దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో అతిపెద్ద విషాదంగా పేర్కొంటున్నారు. ఈ విషాద ఘటన ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్‌ను కాపాడటమే నేను చేయగలిగింది. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీ సెంటరులో ఆ పిల్లకు ఉచిత విద్య అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, ఈ రైలు ప్రమాదంలో విచారణకు నిపుణులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటుచేసి, ఆ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.