బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (18:14 IST)

10న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక చర్చలు.. లాక్డౌన్ తప్పదా?

దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు అనేక రకాలైన ఆంక్షలను చేపట్టింది. అలాగే, కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులో దేశంలో నెలకొన్న కరోనా స్థితిగతులపై చర్చించనున్నారు.  
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదివారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఆదివారం 4.30 గంటల నుంచి ప్రారంభమై సుధీర్ఘంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కూడా సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశంకానున్నారు. 
 
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే దేశంలో మరోమారు లాక్డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుందా అనే సందేహం కలుగుతుంది. సోమవారం జరిగే ఆరోగ్య మంత్రుల సమావేశంలో దేశంలో లాక్డౌన్ ఉంటుందా లేదా అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది.