ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (22:25 IST)

వామ్మో రూ.69లక్షల విలువైన బంగారం.. చెప్పుల్లో దాచాడు..?

gold
రూ.69.40 లక్షల విలువైన బంగారాన్ని తన చెప్పులలో దాచి అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇండిగో విమానంలో బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన నిందితులను కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అడ్డుకున్నారని కస్టమ్స్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 
 
అతను వైద్యం కోసం వెళ్తున్నట్లు అధికారులతో తెలిపాడు. కానీ సదరు ప్రయాణీకులు ఎలాంటి సరైన ధ్రువ పత్రాలను సమర్పించలేకపోయాడని అధికారులు చెప్పారు. ఇది అధికారులకు అనుమానం కలిగించిందని అధికారి తెలిపారు.
 
అనుమానితుడైన ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. బాడీ చెక్ చేసి, అతని బ్యాగ్ చెప్పులను స్కానింగ్ చేయగా, అతను ప్రయాణ సమయంలో ధరించిన చెప్పులలో దాచిపెట్టిన ముక్కల రూపంలో బంగారం ఉన్నట్లు తేలింది. చెప్పులలో రూ. 69.40 లక్షల విలువైన స్వచ్ఛత కలిగిన 1.2 కిలోల నాలుగు బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.