శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (12:44 IST)

పెగాసస్ స్పై వేర్‌పై విచారణకు సుప్రీంకోర్టు సమ్మతం

ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ పెగాసస్ స్పై వేర్ వ్యవహారం ఇపుడు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమ్మతించింది. 
 
పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపైన స్పందించిన అత్యున్నత న్యాయస్థానం విచారణకు ఒకే చెప్పింది.
 
ఈ పిటిషన్‌లపై ఆగస్టు తొలివారంలో విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగాసస్‌పై విచారణ చేపట్టనుంది. 
 
మరోవైపు ఇదే అంశంపై చర్చ జరపాలంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. 
 
కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్చలేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. కాగా పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే లోక్‌సభ అనేకసార్లు వాయిదా పడింది.