శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (16:24 IST)

రెండు తలలు, మూడు కళ్లతో పుట్టిన దూడ.. (video)

Cow
రెండు తలలు, మూడు కళ్లతో పుట్టిన ఆవు దూడగా అమ్మవారి అవతారంగా భావించి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఒడిశాలోని నబరంగపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుములి పంచాయతీలోని బీజాపూర్ గ్రామానికి చెందిన రైతు ధనిరామ్ రెండేండ్ల కిందట ఒక ఆవును కొన్నాడు. 
 
గర్భం దాల్చిన ఆ ఆవు ఇటీవల ఒక దూడను ఈనింది. అయితే ఆ దూడకు రెండు తలలు, మూడు కండ్లు ఉన్నాయి. నవరాత్రుల సమయంలో పుట్టిన అరుదైన ఆవు దూడను దుర్గా మాత అవతారంగా గ్రామస్తులు భావించి పూజలు చేస్తున్నారు. ఈ వింత దూడను చూసేందుకు పరిసర ప్రాంతాల జనం ఆ రైతు ఇంటికి క్యూ కడుతున్నారు.
 
మరోవైపు రెండు తలలు, మూడు కళ్లతో పుట్టిన ఆ దూడ తల్లి పాలు తాగేందుకు ఇబ్బంది పడుతున్నదని రైతు ధనిరామ్‌ తెలిపారు. ఆవు కూడా దూడకు సరిగా పాలు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. దీంతో తాము పాలు కొని ఆ దూడకు తాగిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, జన్యు లోపం కారణంగా ఇలా రెండు తలలు, మూడు కళ్ల వంటి దూడలు జన్మిస్తాయని పశువైద్యులు వివరించారు.