బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (10:09 IST)

త్రిపురలో లెనిన్ ... తమిళనాడులో పెరియార్ విగ్రహాలు కూల్చివేత

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ కార్యకర్తల చర్

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ కార్యకర్తల చర్యలను సమర్థించుకున్నారు. 
 
ఇంతలో తమిళనాడు రాష్ట్రంలోని పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. వేలూరు జిల్లా తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లోపల ఉన్న పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాం పగులగొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిజానికి త్రిపురలో లెనిన్ విగ్రహాలను కూల్చివేసిన మరుసటి రోజే బీజేపీకి చెందిన తమిళనాడు నేత హెచ్.రాజా మాట్లాడుతూ, తమిళనాడులో కూడా పెరియార్ విగ్రహాలను కూల్చివేస్తామంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
 
ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పెరియార్ విగ్రహాలను కూల్చివేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యకు నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు.