బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జులై 2020 (23:46 IST)

పెళ్ళి వేడుకలో మద్యం సరఫరాకు అనుమతి..ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలోనూ వివాహ వేడుకల్లో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తూ చండీఘడ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

చండీఘడ్ కేంద్ర పాలిత ప్రాంతంలో వివాహ వేడుకల్లో ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యాన్ని సరఫరా చేయవచ్చని కేంద్ర సలహాదారు మనోజ్ పరీడా చెప్పారు.

అయితే బార్‌లను మాత్రం మూసి ఉంచాలని ఆదేశించారు. అన్ లాక్ 2 నిబంధనల ప్రకారం లాక్ డౌన్ నిబంధనలను సడలించారు.

చండీఘడ్ కేంద్రపాలిత ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు, కారులో నలుగురు, ఆటోల్లో ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాహనాలను ప్రతీరోజూ శానిటైజ్ చేయడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించాలని ఆదేశించారు.