బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 మే 2020 (08:41 IST)

ఆ మండలంలో ఏరులై పారుతున్న మద్యం!

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో 35 పంచాయతీలు ఉండగా ప్రతి దానిలోనూ బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారుతోంది.

ఆయా గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, ఇళ్లలోనూ కొందరు వ్యాపారులు రాత్రింబవళ్లు మద్యం విక్రయిస్తున్నారు. తాగుడుకు బానిసైన ప్రజలు వేకువజామునే మద్యం తాగుతున్నారు.

ఇటీవల మండలంలోని వివిధ గ్రామాల్లో చోటుచేసుకున్న 90 శాతం హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు మద్యం మత్తులోనే జరిగినట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టాలని, పాలెం, నందివడ్డెమాన్‌, వట్టెం గ్రామాల్లో బెల్టు దుకాణాలను మూసివేయించాలని సర్పంచుల ఆధ్వర్యంలో 2019 డిసెంబర్‌లో ఆబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన బెల్టు దుకాణాలు, కల్లీకల్లును అరికట్టి నేరాలను నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.