బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (21:28 IST)

తాడేపల్లిలో మద్యం సీసాలు స్వాధీనం

తాడేపల్లి మండలం కుంచనపల్లి ప్రాతూరు మధ్య 40 అడుగుల రోడ్డు లో మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. కారులో మద్యం సీసాలు తరలిస్తున్నారని పక్కా సమాచారం  ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.

దీంతో కారులోపల ఉన్న వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. కారులో మొత్తం 65 మద్యం (180 ml)  సీసాలు అధికారులు  గుర్తించారు.

ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ చంద్రశేఖర్ రెడ్డి , మంగళగిరి ఎక్సైజ్ సిఐ ప్రమీలారాణి, ఎస్సై లు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు నారాయణరావు,శ్రీనివాసులు పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ ప్రమీలారాణి తెలిపారు.