గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (21:23 IST)

వ్యవసాయ కూలీల దుర్మరణం బాధాకరం: ప‌వ‌న్‌

ప్రకాశం జిల్లా రాపర్ల దగ్గర చోటుచేసుకొన్న ఘోర ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారని తెలిసి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

"మిర్చి తోటల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కూలీలు ఉన్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొందని తెలిసింది. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

చనిపోయిన వారిలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులున్నారని తెలిసి బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలి. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలి" అని ఆకాంక్షించారు.