శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (20:35 IST)

రాత్రి ఛార్జర్ వేసి నిద్రించిన చిన్నారులు.. సెల్ ఫోన్ పేలడంతో నలుగురు మృతి

Cell phone blast
Cell phone blast
ఛార్జర్‌లో ఫోన్ వుంచి నిద్రపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ, మీరట్, మోదీ పురంకు చెందిన వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. 
 
గత శనివారం రాత్రి ఇంట్లో గేమ్స్ ఆడి సెల్ ఫోన్‌లో ఛార్జర్ తగ్గింది. ఆపై వాళ్లు ఛార్జర్ వేసి నిద్రించారు. అర్థరాత్రి సెల్ ఫోన్ ఛార్జర్‌లో ఏర్పడిన సర్క్యూట్ కారణంగా సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నలుగురు చిన్నారులు చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు.