గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (15:11 IST)

ఢిల్లీ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకో తెలుసా?

delhi metro
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును ఖండిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం చేపట్టింది. ఇందులోభాగంగా, వివిధ రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మంగళవారం కూడా ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. దీని ప్రభావం ఢిల్లీలోని మెట్రో సర్వీసులపై పడింది. భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కళ్యాణ్ మార్గ్‌ మెట్రో స్టేషన్‌లలోని ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేసింది. దీంతో పాటు పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను కూడా మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ విషయాన్ని డీఎంఆర్‌సీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. 
 
కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ సోషల్ మీడియా ఉద్యమం!! 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఆప్ సోషల్ మీడియాలో ఉద్యమం చేపట్టింది. రాజ్యాంగ రక్షణ కోసమంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాన్ని ప్రారంభించింది. ఢిల్లీ మంత్రి అతిషి సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ రక్షణ కోసం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించామని ఆమె తెలిపారు. ఆప్ కార్యకర్తలు, నాయకులు అందరూ 'డీపీ (డిస్‌ప్లే పిక్చర్) కాంపెయిన్' నిర్వహిస్తారని తెలిపారు. 'డీపీ' కింద కటకటాల వెనుక ఉన్న కేజీవాల్ ఫొటో పెడుతారని చెప్పారు. దాని కింద మోడీ కే సబ్సీ బడా దార్ కేజీవాల్ (మోదీని ఎదిరించే మొనగాడు కేజీవాల్ అన్న క్యాప్షన్) అని పెడతామన్నారు.
 
రెండేళ్ల క్రితం ఉపయోగించిన ఫోన్‌ను కేజ్రివాల్ ధ్వంసం చేశారని, మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అందులో ఉండి ఉండవచ్చని ఈడీ వర్గాలు చెప్పడంపైనా అతిషి అభ్యంతరం చెప్పారు. ఆ ఫోన్ కనిపించడం లేదని, అదెక్కడ ఉందో కూడా తెలియదని దర్యాప్తులో కేజ్రివాల్ చెప్పినట్టు పేర్కొన్నాయి. ఈ కేసులోని సాక్షులు మొత్తం 170 సెల్ ఫోన్లను పారవేసి, ఆధారాలు నాశనం చేసినట్టు గతంలో ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఆఫిడవిట్ రూపంలో జడ్జి ముందు కోర్టులో చెప్పా అని అతిషి డిమాండ్ చేశారు. 
 
మరోవైపు కేజ్రివాల్ భార్య సునీత పలువురు కార్యకర్తలతో కలిసి సోమవారం ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడికి విచారణకు హాజరైన కేజీవాల్‌తో మాట్లాడారు. జైలులో ఉన్న కేజీవాల్‌ ఎలాంటి కంప్యూటర్లు, కాగితాలు సమకూర్చలేదని ఈడీ స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఢిల్లీలోని మంచినీటి సమస్య విషయమై జైలు నుంచే ఏవిధంగా ఆదేశాలిచ్చారో ఆరా తీస్తామని తెలిపింది. జైలు నుంచే ఉత్తర్వులు ఇచ్చారంటూ చెప్పిన మంత్రి అతిషి నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. ది. జైలు నుంచే కేజ్రివాల్ లేఖ ఇచ్చారంటూ మంత్రి చెప్పడాన్ని బీజేపీ ఖండించింది. అనుకున్న ప్రకారం జరుగుతున్న నాటకమని విమర్శించింది.