1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (09:15 IST)

విద్యార్థి జేబులోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది.. ఎక్కడ?

mobile massage
ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. నెల్లూరులో జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ నిన్న బోగోలు మండలం కడనూతలతోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్కూటీపై బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద  జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.