ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:44 IST)

అబ్బే.. పేరుకే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి.. ఇలా చేశారేంటి?

రాజస్థాన్‌ సర్కారుకి మరో మంత్రి చేసిన పని తలపట్టుకునేలా చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌లో ఇప్పటికే వసుంధరా రాజే సర్కారుపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో .. తాజాగా ఆరోగ్య మంత్రిగా వున్న కాళీచరణ్ సరాఫ్ చేస

రాజస్థాన్‌ సర్కారుకి మరో మంత్రి చేసిన పని తలపట్టుకునేలా చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌లో ఇప్పటికే వసుంధరా రాజే సర్కారుపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో .. తాజాగా ఆరోగ్య మంత్రిగా వున్న కాళీచరణ్ సరాఫ్ చేసిన పని నెట్టింట తలదించుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆరోగ్య మంత్రిగా వుండి.. కాళీచరణ్ సరాఫ్.. తన కారును రోడ్డు పక్కన ఆపించి.. పక్కనే వున్న గోడపై మూత్ర విసర్జన చేస్తున్న సినిమాలు ప్రస్తుతం జైపూర్‌లో వైరల్ అయ్యాయి. 
 
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పోటీకి నిలిచిన జైపూరును మరింత శుభ్రం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో శ్రమిస్తుంటే.. ఆరోగ్య మంత్రి ఇలాంటి పనిచేయడం ఏంటని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సాధారణ ప్రజులు ఎవరైనా ఇలా బహిరంగంగా గోడలను తడిపితే రూ. 200 జరిమానా వేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రం ఏమీ చేయడం లేదని, ప్రజలు మారుతున్నా, ఈ నేతలు మారడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.