1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (07:29 IST)

అఫ్జల్ గురు అవశేషాలేవి... ? మాకు అప్పగించండి : పీడీపీ

అప్జల్ గురును ఉరితీశారు. ఆయనను ఖననం చేశారు. మరి ఆయన అవశేషాలు ఎక్కడున్నాయి. వాటిని మాకు అప్పగించండి.. అంటూ పిడిపి మొదటి ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ మనసులోని మాటను బయట పెట్టారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీపై పిడిపి దృష్టి పెట్టంది. ఇందులో భాగమే ఈ ప్రకటన వివరాలిలా ఉన్నాయి. 
 
పార్లమెంటుపై దాడికి తెగబడడంతో కీలక పాత్రదారి అయిన ఉగ్రవాది అఫ్జల్‌ను తీహార్ జైల్లో 2013, ఫిబ్రవరి 9న ఉరితీశారు. అనంతరం ఖననం చేశారు కూడా. అయితే కాశ్మీర్ ఎన్నికలలో అఫ్జల్ గురు మృతదేహ అవశేషాలను వెనక్కు తెప్పిస్తామన్నది పీడీపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ దిశగా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 
 
అందులో భాగంగానే  ఆయన అవశేషాలను అప్పగించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అఫ్జల్ గురు ఉరి న్యాయాన్ని అవహేళన చేయడమేనని పీడీపీ భావిస్తోంది. ఆ ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. నిందితుల్లో 28వ వాడుగా ఉన్న అఫ్జల్‌గురును ప్రత్యేకంగా విచారించి, ఉరిశిక్ష విధించడాన్ని పీడీపీ అప్పుడే ఖండించింది.