ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (15:32 IST)

పీఎం కిసాన్ యోజన : రైతుల ఖాతాల్లో డబ్బు జమ

దేశంలోని రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులఖాతాల్లోకి డబ్బులను జమచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో అమల్లోకి తెచ్చింది. 
 
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద 9వ విడత నిధులు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేశారు. 
 
ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరినట్లే. దేశంలోని రైతులకు 19,500 కోట్లు ఈ కార్యక్రమం కింద విడుదల అయ్యాయి. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. రూ.6 వేలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే.