గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (11:35 IST)

అస్సో - మిజోరం సరిహద్దు రచ్చ : ప్రధాని మోడీతో హిమంత్ బిశ్వా

ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సోం - మిజోరాం రాష్ట్రాల సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌బిస్వా శర్మ సోమవారం ప్రధాని నరేంంద్ర మోడీతో సమావేశంకానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఈశాన్య రాష్ట్రాలు తమ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం చర్చ జరిపితీరుతానని అన్నారు. కేవలం మిజోరాం మాత్రమే కాదని, సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నాయని, తమ రాష్ట్రానికి నిర్ధిష్టమైన హద్దులు కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 
హోం మంత్రి అమిత్‌షా ఈ అంశానికి పరిష్కారం చూపించకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని మిజోరాం గవర్నర్‌ డా.హరిబాబు కంభంపాటి అన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని సిఎంలు ఆశిస్తున్నారని అన్నారు.
 
గత నెల 26న జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులతో పాటు ఒక పౌరుడు మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొనేందుకు కేంద్రం పంపిన ప్రత్యేక బృందాలు పహారా కాసేందుకు అంగీకరిస్తున్నట్లు ఇరురాష్ట్రాలు సంయుక్త ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే.